గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయిల్లో కొత్త రికార్డు  

వాతావరణంలోని గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయిల్లో కొత్త రికార్డు నెలకొన్నది. 2018లో ఇది గరిష్ఠానికి చేరడంపై ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం సంస్థ (డబ్ల్యూఎంవో) ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణంలో అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్న ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో మానవాళికి సంభవించే ముప్పు నుంచి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అత్యవసర కార్యాచరణ అవసరమని తాజాగా  పిలుపునిచ్చింది. 

వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు సాంద్రత 2018లో 407.8 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం) ఉన్నదని గ్రీన్‌హౌస్‌ వాయువులపై విడుదల చేసిన వార్షిక బులెటిన్‌లో పేర్కొన్నారు. 2017లో నమోదైన 405.5 పీపీఎంతో పోల్చితే సగటు వార్షిక పెరుగుదల కన్నా ఇది పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 

పారిస్‌ ఒప్పందం కింద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాతావరణంలోని గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయిని తగ్గించడంలో ఎలాంటి మార్పు లేదని డబ్ల్యూఎంవో అధిపతి పెట్రి తలాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది ఇలాగే కొనసాగితే ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల సముద్ర జల మట్టాలు పెరుగుతాయని, ఫలితంగా పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. వాతావరణంలో సంభవించే ఈ మార్పులు భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.      

 వాతావ‌ర‌ణంలో కార్బ‌న్ డైయాక్సైడ్ మ‌ళ్లీ పెరుగుతోంది. గ్రీన్‌హౌజ్ వాయువుల సాంద్ర‌త మ‌రింత అధిక‌మైన‌ట్లు తాజా రిపోర్ట్‌లు వెల్ల‌డిస్తున్నాయి. 2018లో గ్రీన్‌హౌజ్ వాయువులు రికార్డు క్రియేట్ చేసిన‌ట్లు ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. 

గ‌త ద‌శాబ్ధంతో పోలిస్తే ఈ సారి కార్బ‌న్ డైయాక్సైడ్ స‌గ‌టు క‌న్నా ఎక్కువ న‌మోదు అయ్యింద‌ని డ‌బ్ల్యూఎంవో చెప్పింది. సోమ‌వారం ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. ఇత‌ర విధ్వంస‌క‌ర వాయువులు కూడా పెరిగిన‌ట్లు అంచ‌నా వేశారు. మీథేన్‌, నైట్ర‌స్ ఆక్సైడ్ స‌గ‌టు క‌న్నా ఎక్కువ రేటుతో వాతావ‌ర‌ణంలో పెరుగుతున్న‌ట్లు పేర్కొన్న‌ది. 

1990 నుంచి గ్రీన్‌హౌజ్ వాయువులు 43 శాతం పెరిగిన‌ట్లు తెలిపింది. 2018లో కార్బ‌న్ డైయాక్సైడ్ (కాన్‌స‌న్‌ట్రేష‌న్) సాంద్ర‌త‌ 407.8 పీపీఎంకు చేరుకున్న‌ట్లు రిపోర్ట్ చెప్పింది. 2017లో ఇది 405.5 పీపీఎంలుగా ఉంది. 1750లో పారిశ్రామిక విప్ల‌వం మొద‌లుకాక‌ముందు ఉన్న సాంద్ర‌త క‌న్నా దాదాపు 50 శాతం కార్బ‌న్ డైయాక్సైడ్ పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.