తెలంగాణలో పడకేస్తున్న జలవిద్యుత్

విద్యుత్ ఉత్పాదనలో ఒకప్పుడు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణను మిగులు రాష్ట్రంగా చేస్తామని కెసిఆర్ ప్రభుత్వం చెబుతున్నా కీలకమైన జలవిద్యుత్ రంగంలో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నది. కొత్త ప్రాజెక్ట్ లవైపు చూడటం ఏమో గాని ఉన్న ప్రాజెక్ట్ లలో సహితం సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేపటలేక పోతున్నారు. రాష్ట్రంలోని  జలవిద్యుత్ కేంద్రాలలో 2,411.8 మెగా వాట్ల ఉత్పత్తి సామర్ధ్యం వుంటే కేవలం 700 మెగావాట్లకు మించి ఉత్పత్తి కావటం లేదు.

 సకాలంలో వర్షాలు కురవకపోవటం,ఎగువ రాష్ట్రాల నుంచి రావల్సిన నీటి ప్రవాహం తగ్గుతుండటం వంటి కారణాలతో జల విదుత్ ఉత్పత్తి సక్రమంగా సాగటం లేదని చెబుతున్నారు. ఉమ్మడి రాస్త్రంలో సహితం 2009లో మినహా సామర్ధ్యం మేరకు ఉత్పాదన ఎన్నడూ జరగనే లేదు. ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి బాగా ఖరీదు కావటంతో జలవిద్యుత్ కు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.

రాష్ట్రంలోగల 11జల విద్యుత్ కేంద్రాలలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రాల నుంచి 900 మెగవాట్లు, 815 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. వీటితోపాటు ప్రియదర్సినిజూరాల   లోయర్ జూరాల 240 మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. మిగతా కేంద్రా  అన్ని 100 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్లాంట్లే. గత సంవత్సరం వీటన్నింటిలో కలిపి 700 మెగావాట్లకు మించి ఉత్పత్తి చేయలేక పోయారు. అంతకు ముందు సంవత్సరం అంతకన్నా తక్కువగా జరిగింది.

శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో సహితం పూర్తిగా నీరు లభ్యం కావడం లేదు. దానితో పూర్తి సామర్ధ్యంతో పనిచేయలేక పోతున్నారు.