ఆర్టీసీ భూములుకై సీఎం కేసీఆర్ కుట్ర   

ఆర్టీసీ భూములు అమ్ముకుందామని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ లో జరుగుతున్న ఆర్టీసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటిస్తూ కేసీఆర్ హోల్ సేల్ గా ఎమ్మెల్యేలు రిటేల్ గా దోపిడీ చేస్తున్నారని విమర్శించారురు. 

కేసీఆర్ తన కుటుంబం మీద చూపించే ప్రేమలో ఐదు శాతమైనా ఆర్టీసీ మీద చూపించాలని అరవింద్ కోరారు.  ఆర్టీసీ కార్మికుల బలి దానాలకు సీఎం కేసీఆర్ అహంకార ప్రకటనలే కారణమని మండిపడ్డాయిరు. ఆర్టీసీ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని దుయ్యబట్టారు. 

కేసీఆర్ గద్దె దిగే రోజు దెగ్గరలోనే ఉందని అరవింద్ స్పష్టం చేశారు.  ఎన్ని రోజులు నియతృత్వ పాలన నడిపిస్తడో చూద్దామని చెప్పారు. కేసీఆర్ జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొంటూ ఇప్పటికే ఆయన విపరీత పాపాలు చేశారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండండని కోరుతూ మీరు విజయం సాధించే రోజు దూరంలో లేదని భరోసా ఇచ్చారు. 

ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపరే అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం గమనిస్తుందని హెచ్చరించారు.