పోలీస్ దాడిపై స్పీకర్ కు బండి సంజయ్ ఫిర్యాదు 

పార్లమెంటు సభ్యుడిగా తనకు ఉన్న హక్కులకు పోలీసులు భంగం కలిగించారంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్ సభకు  ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. 

ఎంపీ అన్న కనీస గౌరవం కూడా లేకుండా తనపై పోలీసులు దురుసుగా దాడి చేశారని  సంజయ్ చెప్పారు. కరీనంగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని స్పీకర్ కు వివరించారాయన. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందజేసి, వాటిని పరిశీలించాల్సిందిగా కోరారు. 

పార్లమెంటు సభ్యుడనైన తన హక్కులకు  పోలీసులు భంగం కలిగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్స్పెక్టర్ అంజయ్య పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.