అమెరికా సెనేటర్‌గా హైదరాబాద్ మహిళ

అమెరికాలో హైదరాబాద్ మహిళ సెనేటర్‌గా గెలిచి రికార్డు సృష్టించారు. వర్జీనియా స్టేట్ సెనెటర్‌గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిపై రిపబ్లిక్ పార్టీ నుంచి ఆమె ఘన విజయం సాధించారు. ఘజలా హష్మీ అనే మహిళ చిన్నప్పుడు మున్నిగా పిలిచేవారు. 

గత యాబై సంవత్సరాల క్రితం మున్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి అమెరికా వలసపోయారు. ఫస్ట్ ముస్లిం-అమెరికన్, ఇండియన్-అమెరికన్‌గా సెనెటర్‌గా గెలిచి రికార్డు సృష్టించారు. ముస్లిం మహిళలు అమెరికా రాజకీయలలో విజయ దుందుభి మోగిస్తున్నారు. గత సంవత్సరం ముస్లిములు ఇల్హాన్ ఓమర్, రషీదా తాయబ్ అనే ఇద్దరు యుఎస్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. 

డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఎక్స్‌లెన్స్ కంపెనీలో టీచర్ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసి రాజకీయాలలో వచ్చారు. ఈ విజయం నాది కాదని అందరం కలిస్తేనే విజయం సాధించానని ఆమె చెప్పారు. వర్జీనియా స్టేట్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పారు. గన్ కల్చర్, వాతావరణ సంక్షోభం నుంచి వర్జీనియన్స్ కాపాడుతానని హామీ ఇచ్చారు. 

జార్జ్ సౌతర్న్ యూనివర్సిటీ నుంచి బిఎ ఇంగ్లీష్ చదివి, హెమోరీ యూనివర్సిటీలో ఆమె పిహెచ్‌డి చేశారు. 1991 నుంచి రిచ్‌మండ్‌లో ఆమె, ఆమె భర్త అజార్ నివసిస్తున్నారు. మున్నికి ఇద్దరు కూతుళ్లున్నారు. దుబాయ్‌లో నివసించే జఫార్ అక్బర్ అనే వ్యక్తి ఆమెను అభినందించాడు. గ్రేట్ సెనెటర్ అవుతారని పేర్కొన్నారు. 

తాను, ఆమె మలక్‌పేటలోని అజిజా స్కూల్ చదివినట్టు తెలిపాడు. ట్విట్టర్‌లో నెటిజన్లు మున్నిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంఎన్‌సి కంపెనీలో మేనేజర్‌గా పని చేసే సయీద్ అనే నెటిజన్ ఓ ముస్లిం మహిళ సెనేటర్ కావడం గొప్ప విషయమని కొనియాడారు.