మానవాళికే పెను విపత్తుగా వాతావరణ సంక్షోభం 

వాతావరణ సంక్షోభం ఎమర్జెన్సీ స్థాయికి చేరుకుందని 153 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మందికి పైగా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోకపోతే మానవాళికే అది పెను విపత్తుగా పరిణమిస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులకు దారి తీస్తున్న హరితగృహ వాయువుల విడుదల, ఇతర కాలుష్య కారకాల వల్ల భూగోళం వేడెక్కకుండా చూడాలని పిల్పుపిచ్చారు. ప్రపంచ ప్రజలపై చూపే దుష్ప్రభావం అంతా ఇంతా కాదని వారించారు. 

జర్నల్‌ బయోసైన్స్‌ పత్రికలో ప్రచురించిన ఒక పత్రంలో భారత్‌కు చెందిన 69 మందితో పాటు వివిధ దేశాలకు చెందిన 11,258 మంది శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని సమీక్షించారు. వాతావరణ మార్పులపై 2016 నవంబరు4న కుదిరిన పారిస్‌ ఒప్పందం మూడేళ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజు, ఈ ఒప్పందం నుంచి అమెరికా అధికారికంగా తప్పుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన తరువాతి రోజున శాస్త్రవేత్తల నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. 

భూ ఉష్ణో గ్రతలు 1.5 డిగ్రీల సెల్షియస్‌ స్థాయిని దాటిపోయేందుకు ఇంకా 12 ఏళ్లు మాత్రమే ఉన్నందన, దీనిపై సత్వరమే ప్రపంచ దేశాలు కదలాలని వారు కోరారు. 2030 నాటికల్లా భూ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్లియస్‌కు మించకుండా చూడాలని పారిస్‌ ఒప్పందం నిర్దేశిస్తున్నది. ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజి (ఐపిసిసి) నివేదిక విడుదలైనప్పటి నుంచి ప్రపంచ వ్యాపితంగా యవత వీధుల్లోకి వచ్చి వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ కాలంలో బ్రిటన్‌, పోర్చుగల్‌, కెనడా, అర్జెంటీనాతో సహా 23 దేశాల్లో పెద్దయెత్తున సమ్మెలు జరిగాయి. ప్రమాదరకర స్థాయి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి గత నాలుగు దశాబ్దాల డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులతో ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వాతావరణ ఎమర్జె