రాజీనామా యోచనలో ఎల్‌వి సుబ్రహ్యణ్యం!   

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి అర్ధాంతరంగా తనను బదిలీ చేసిన తీరుపై తీవ్ర మనస్థాపంతో ఉన్న సీనియర్‌ ఐఐఎస్‌ అదికారి ఎల్‌వి సుబ్రహ్యణ్యం ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. లేదా కేంద్ర సర్వీస్ లకు వెళ్లే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ముందుగా పదవీ బాధ్యతల నుండి వైదొలిగిన తర్వాత సెలవుపై వెళ్లాలనుకొంటున్నట్లు సన్నిహితులు భావిస్తున్నారు. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వ నిర్ణయం వెలువడిన కాసేపటికే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి ఆయన ఇప్పటికే వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం తనను అవమానకరంగా తప్పించిందని ఆయన భావిస్తున్నారు. దాదాపుగా ఎల్‌వి సన్నిహితులందరూ రాజీనామా చేసి, తప్పుకోవడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయనతో వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సాధ్యమైనంత త్వరలో ఆ దిశలోనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

మరోవైపు ఎల్‌వి సుబ్రహ్మణ్యంను తప్పించిన తీరుపై సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు పలువురు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొందరు బాహాటంగానే స్పందిస్తుంటే మరికొందరు అంతర్గత సమావేశాల్లో ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి, రాష్ట్ర ఆరగ్య సంస్కరణల అమలు కమిటీ సహ చైర్‌పర్సన్‌ సుజాతారావు ఈ విషయమై బహిరంగంగానే స్పందించారు. 

'నిబంధనలు అమలు చేసినందుకు సిఎస్‌ను బయటకు గెరటేశారు' అని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనలతో ఉన్న పాలనే అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్న ఆమె, కొత్త ముఖ్యమంత్రికి మంచి సలహాదారులు అవసరమని తన ట్విట్టర్‌లో సూచిరచారు. ప్రభుత్వ కమిటీలో ఉన్న సమయంలోనే ఆమే చేసిన ఈ వ్యాఖ్యలు సీనియర్ల మనోభావాలను అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. 

ఇంతకు ఆయన బదిలీకి ప్రధాన కారణంగా చెబుతున్న బిజెనెస్‌ నిబంధనలను మార్పు చేస్తూ గత నెల 24న ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జిఓ చట్టబద్దత పట్ల ఇప్పుడు అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఇటువంటి కీలక ఉత్తర్వుల జారీకి మురదుగా సవరణ ప్రతిపాదనలను తయారు చేసి దానిని న్యాయశాఖ సలహాకు పంపించాలని, ఆ తరువాత సిఎస్‌ ద్వారా ముఖ్యమంత్రికి, తరువాత మంత్రివర్గ ఆమోదానికి పరపిరచాలని చెబుతున్నారు. 

అనతరం శాసనసభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొరదిన తరువాత గవర్నర్‌కు పంపించి అప్పుడు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రవీణ్‌ప్రకాశ్‌ జారీ చేసిన జిఓ విషయంలో ఇటువంటి ప్రక్రియ జరగలేదని చెబుతున్నారు. దీనినే ఎల్‌వి తప్పు పట్టారని వారు గుర్తు చేస్తున్నారు.