ఎల్ వి బదిలీ వెనుక క్రైస్తవుల వత్తిడి!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రమణ్యంను అర్ధాంతరంగా బదిలీ చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రిన్సిపాల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో ఏర్పడిన బేదాభిప్రాయాలు కావని, క్రైసవ వర్గాల నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వత్తిడులే కారణమని పలువురు భావిస్తున్నారు. ఆయన బదిలీ కాగానే క్రైస్తవ వర్గాలు సంబరాలు చేసుకోవడమే కాకుండా, హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన కూడా జారీ చేయడం ఈ సందర్భంగా పలువురు దృష్టిని ఆకట్టుకొంటున్నది. 

హిందూ దేవాలయాలలో పాగావేసిన క్రైస్తవులను ఏరివేయడం పట్ల ఎల్వి ధృడంగా వ్యవహరించడంతో వారి ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. పైగా, తాడికొండ రిజర్వేడ్ నియోజకవర్గం నుండి ఎన్నికైన వైసిపి అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి మథరీత్యా క్రైస్తవురాలని, ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు అందటం, ఆ ఫిర్యాదుపై ప్రధానకార్యదర్శిని దర్యాప్తు జరిపి నివేదిక పంపమని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆదేశించడం తెలిసిందే. 

ఈ విషయంలో ఆమెకు అనుకూలంగా నివేదిక ఇవ్వమని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వస్తున్న వత్తిడులను ఎల్వి లెక్క చేయక పోవడం ఆయన బదిలీకి ప్రధాన కారణంగా చెబు ఉతున్నారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తే అంతటితో ఆగదని, రాష్ట్రంలో కీలక పదవులలో ఉన్న పలువురి క్రైస్తవుల బండారం కూడా బైట పడగలదనే భయంతోనే ఎల్విని సాగనంపారని భావిస్తున్నారు. 

పైగా, ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆర్ఎస్ఎస్ ఏజెంట్  అంటూ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆరోపించింది. అందుకే ఆయన ఆకస్మికంగా బదిలీ కాగానే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నామని ఆ సంస్థ ప్రతినిధి జెరుషలేము మత్తయ్య ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖలో దశాబ్దాలుగా సేవలు చేస్తున్న దళిత ఉద్యోగులను సామూహికంగా తొలగించేందుకు ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారని మత్తయ్య అంటున్నారు. 

క్రైస్తవుల పై కక్ష సాధింపు జీవోలు విడుదల చేసి ఎల్ వి సుబ్రహ్మణ్యం క్రైస్తవ మత దూషణకు పాల్పడ్డారని, అందుకు శిక్ష అనుభవించారని ముత్తయ్య స్పష్టం చేశారు. ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎల్ వి సుబ్రహ్మణ్యం ను తీసేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నదని ఆయన తెలిపారు. హిందూ మత అనుకూల ఎల్ వి సుబ్రహ్మణ్యంను తీసేసిన నందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఎల్ వి సుబ్రహ్మణ్యంను ప్రాధాన్యత లేని శాఖ కు బదిలీ చేయడం క్రైస్తవుల ఆత్మగౌరవ విజయమని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ అధికారి అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను బదిలీ చేస్తే క్రైస్తవ మత సంఘాలు హర్షం వ్యక్తం చేయడం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తెలిగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం లాగా ఉందని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు ట్వట్టర్ లో పెట్టడం గమనార్హం. 

ఇలా క్రైస్తవ సంఘాల విజయం అని చెప్పుకుంటూ, కేక్ లు కట్ చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే దారుణ పరిణామాలకు సంకేతంగా నిలవబోతున్నదని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు.