ఎంపీ అని కూడా చూడకుండా కొట్టారు

కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు దారుణంగా వ్యవహారిస్తున్నారన్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర తీస్తుండగా..పోలీసులు తనపై చేయి చేసుకోవడంతో సీరియస్ అయ్యారు. శాంతియుతంగా బాబు అంతిమయాత్ర చేస్తుండగా పోలీసులు శవాన్ని ఎత్తుకెళ్లడం దారుణమని ధ్వజమెత్తారు. ఎంపీపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.

పేద కార్మికుడు చనిపోతే పోలీసులు విధ్వంసం సృష్టించారని., శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు సీఎం ఆదేశంతోనే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పండుగలు లేవు పబ్బలులేని కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందని హెచ్చరించారు. ఎంపీని కాలర్ పట్టుకొని కొడుతరా అని సీరియస్ అయ్యారు బండి సంజయ్.

రోడ్డు మీద కుక్క చనిపోయినా అయ్యే అంటాం..అలాంటిది ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా సీఎం రాకపోవడంకాదుకదా..కనీసం కనికరంలేకుండా వ్యవహారించడం దారుణని దుయ్యబట్టారు. శుక్రవారం కరీంనగర్ లో బాబు అంత్యక్రియల్లో భాగంగా మాట్లాడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆందోళన చెందిన డ్రైవర్ బాబు జేఏసీ సభలో బాబు చనిపోవడం దారుణమన్నారు. 

మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి చలిస్తున్నా..ముఖ్యమంత్రికి జాలి కలగడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ లో ఆర్టీసీ డీపోలేకపోవడంతోనే సీఎం కేసీఆర్ బతికిపోయాడని..సభకు అడ్డదారుల్లో వెళ్లారని తెలిపారు. "బిడ్డా కేసీఆర్ ఇవ్వాళ బాబు చనిపోయాడు. మృతదేహం కుళ్లిపోయే అవకాశం ఉండటంతో బతికిపోయావని..లేకుంటే చర్చలు జరిపేంతవరకు అంత్యక్రియలు చేయకపోయేవారం" అని స్పష్టం చేశారు. 

బాబు ఫ్యామిలీ కోరికమేరకే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించామని చెబుతూ ప్రజాస్వామ్యం అందరికి హక్కు.. ఎవ్వరికీ భయం అవసరంలేదని అభయ మిచ్ఛారు. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కరీంనగర్ నుంచే తీరాలని..పోరాడితే పోయేదేమిలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ ఏందో ఆర్టీసీ కార్మికులు చూపిస్తారని హెచ్చరించారు.