సుజనా చౌదరి వెంటే టీడీపీ ఎమ్మెల్యే వంశీ  

కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా, రెండు రోజులుగా సుజనా చౌదరితో కలసి బిజెపి చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో కూడా పాల్గొనడం ఆసక్తి కలిగిస్తున్నది. 

మరోవైపు ఎమ్మెల్యే వంశీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  అంతేకాకుండా ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డిని కూడా వంశీ కలిశారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో  సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. 

అయితే గురువారం నాడు అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన వంశీ.. అనంతరం మీడియా మీట్ నిర్వహించి పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే వంశీ ఆ మాటలు అన్న కొన్ని గంటలకే బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి మరీ సుజనాను కలవడంతో అసలేం జరుగుతోందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

కాగా, గురువారం నాడు అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన వంశీ.. అనంతరం మీడియా మీట్ నిర్వహించి పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే వంశీ ఆ మాటలు అన్న కొన్ని గంటలకే బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి మరీ సుజనాను కలవడంతో అసలేం జరుగుతోందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. 

ఇలా ఉండగా,  వంశీపై నకిలీ పట్టాల కేసు నమోదైన విషయం విదితమే. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని హనుమాన్‌జంక్షన్‌ పోలీసుస్టేషన్‌లో అక్టోబరు 18న ఎమ్మెల్యే వంశీతోపాటు మరో 9 మందిపై కేసు రిజిస్టర్‌ చేశారు. ఎన్నికల సమయంలో పేదలకు నకిలీ పట్టాలు మంజూరుచేశారనే అభియోగంపై కేసు నమోదుచేయగా వంశీని 10వ నిందితుడిగా చేర్చారు.