తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ప్టాస్టిక్ నిషేధం 

పర్యావరణానికి హాని తల పెట్టే సింగిల్ యూజ్డ్ ప్టాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు.  ప్రగతి భవన్ లో  మంత్రులతో కలెక్టర్లతో సమావేశమైన ఆయన… గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. ఇందులో భాగంగా ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నామని వెల్లడించారు. 

త్వరలోనే దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీచేస్తమని కేసీఆర్ తెలిపారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను తయారుచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.   ప్రజలు కూడా ప్లాస్టిక్ దూరంగా ఉండాలని కోరారు. 

గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయని… పవర్ వీక్ ను విద్యుత్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. అన్ని శాఖలకంటే విద్యుత్ రంగం మొదటగా నిలిచిందని మెచ్చుకున్నారు. పల్లే ప్రగతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్లిందని.. మన ఊరిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన వచ్చిందని చెప్పారు. 

భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తమని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీనెల రూ.339 కోట్లనిధులను విడుదల చేసే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ తెలిపారు.