ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ సన్నాహం !

ఇదు నెలలు ముందుగానే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సిద్దపడుతున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం మరో రెండు నెలలో అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నట్లు చేబుతున్నారు. ఈ మధ్య ముందస్తు ఎన్నికలకు సిద్దమా అంటూ ప్రతిపక్షాలకు ఆయన చేసిన సవాల్ యాదృశ్చికం కాదని, లోతయిన ఆలోచనతోనే చేసారని పలువురు భావిస్తున్నారు.

సాధారణంగా అయితే వచ్చే ఏడాది ఏప్రిల్-మే లలో లోక్ సభతో పాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగవలసి ఉంది. ఈ సంవత్సరం చివరిలో జరిగే నాలుగు రాష్త్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కొంచెం పుంజుకొంటె లోక్ సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ దూకుడిగా ఉంటుందని, మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ప్రజలలో గల ఆకర్షణ శక్తీ ముందు తమ పార్టీ చతికల పడే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.

నాలుగు రాస్త్రాలతో పాటు ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు వెడితే బిజెపి, కాంగ్రెస్ ఉత్తరాది రాష్త్రాలలో ఎన్నికల పట్ల ద్రుష్టి కేంద్రీకరిస్తూ ఉంటాయని, తెలంగాణ గురించి పెద్దగా పట్టించుకోక పోవచ్చని అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు జరపాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదనను దేశ ప్రజల ముందు ఉంచినా ఆ దిశలో ఇంకా చెప్పుకోదగిన కదలిక కనబడటం లేదు. దానితో పార్లమెంట్ కు ముందుగా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

రైతు బంధు, రైతు భీమా పధకాలను భారీ స్థాయిలో అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెడితే గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నదని అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం వరకు అడిగితే ఈ పదకలలోని లొసుగులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం కుడా లేకపోలేదని భావిస్తున్నారు.