ఏపీలో రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

అక్టోబర్‌ 13న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి రోజున నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

వాల్మీకి జయంతి నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 13 జిల్లాలకు రూ.25 లక్షల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి జయంతిని అనంతపురం జిల్లాలో రాష్ట్ర  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

వాల్మీకి జయంతి నిర్వహణకు అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలను కేటాయించింది. మిలిగిన 12 జిల్లాలకు రూ.లక్షన్నర చొప్పున నిధులను ప్రభుత్వం కేటాయించింది.   ఆ మేరకు బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.