వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం  

వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు వైద్యులను వరించింది. 2019 ఏడాదికి గాను 

అమెరికా పరిశోధకులైన విలియం జీ.కెలిన్ జూనియర్, సర్ పీటర్ జే.రాట్‌క్లిఫ్ లతో పాటు బ్రిటన్ కు చెందిన గ్రెగ్ ఎల్.సిమెంజాలను ఉమ్మడిగా ఈ అవార్డుకు నోబెల్ జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.   

శరీరంలోని కణాల ఎలా స్పందిస్తాయి? అంటే ప్రాణవాయువు లభ్యతను బట్టి అవి స్వీకరిస్తాయన్న అంశంపై జరిపిన పరిశోధనలకు గానూ వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని నోబెల్ కమిటీ ప్రకటించింది. 

వారి పరిశోధనలు కేన్సర్, అనీమియాతో పాటు ఇతర వ్యాధులపై పోరాడేందుకు ఉపయోగపడతాయని కమిటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని 2019 కి గాను వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశామని కమిటీ ప్రకటించింది.  ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో పురస్కారాన్ని అందజేస్తారు.