బిజెపిలో చేరనున్న దేవేందర్ గౌడ్ తనయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు వీరేందర్‌గౌడ్ రాజీనామా లేఖ పంపారు. 

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలుగు యువత 

అక్టోబర్ 3న ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారు. దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు.