కర్ణాటకలో బిజెపిలోకి కీలక కాంగ్రెస్ నేత!

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగులుతున్నది. బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ (రాజ్యసభ) అనిల్‌లాడ్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలి కమలంలో చేరేందుకు సిద్దమయ్యారు. అక్టోబరు 5 లేదా 6 తేదీల్లో బెంగళూరులో బీజేపీ నాయకులు శ్రీరాములు, యడ్యూరప్ప, సోమశేఖర్‌రెడ్డి ఇతర బీజేపీ పార్టీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరునున్నట్లు అనిల్‌లాడ్‌ ప్రకటించారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ముందు నుంచి కీలక రాజకీయ నాయకుడుగా అనిల్‌ కొనసాగా రు. బళ్లారి నగరం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి ఒక సారి గెలిచారు. ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా పార్టీ వీడడానికి కాంగ్రెస్‌ నాయకుల్లో ఉండే అంతర్గత విభేదాలే కారణం అని చెప్పారు.

గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ తరుపున నిలిచిన తనను ఓడిండేందుకు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబు లాంటి నాయకులు పనిచేశారన్నారని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయ నాయకులు ఉండే పార్టీలో ఉండడంకన్నా వేరే పార్టీలో చేరితే మం చిదనే ఉద్దేశంతో పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే పదవి అడ్డు పెట్టుకోవడంతో పాటు సీనియర్‌ నాయకుడుగా చెప్పుకునే కేసీ కొండయ్య, విజయనగరం ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడితే అసలు సత్తా బ యట పడుతుందని ఎద్దేవా చేశారు.