పేదలకు, బిసిలకు ఎప్పుడూ హక్కులివ్వని కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏడు దశాబ్దాల పాటు పాలించింది, కాని పేదలకు, బలహీన వర్గాలకు (బిసి) ఎపుడు హక్కులు ఇవ్వలేదని బిజెపి అద్యక్షుడు అమిత్ షా దయ్యబట్టారు. తెలంగాణలో పార్టీ ఎన్నికల శంఖారావం పూరించిన మరుసటి రోజుననే ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్ కు ఒకే వారంలో రెండోసారి వెళ్ళారు.

పాలిలో బిజెపి నిర్వహిస్తున్న ఒబిసి సమ్మేళనంలో ప్రసంగిస్తూ సమాజంలో వెనుకబడిన వారికి న్యాయం కలిగించడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని ద్వజమెత్తారు. జాతీయ వెనుకబడిన వర్గాల కమీషన్ కు రాజ్యంగా ప్రతిపత్తి కల్పించడంతో పాటు సమాజంలో అన్ని కులాలు, వర్గాలకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన చెప్పారు.

రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రు, నానమ్మ ఇందిరాజీ, నాన్నగారు రాజీవ్ జీ, అమ్మ సొంయాజి భారత్ ను 70 ఏళ్ళపాటు పరిపాలించారు. కాని, పేదలకు, వెనుకబడిన ప్రజలకు ఇవ్వవలసిన హక్కులు ఇవ్వనే లేదని చెబుతూ దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందే అవకాశం కలగాలని తెలిపారు.  అదే బిజెపి ప్రత్యేకత అని మూడురోజుల రాజస్తాన్ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

బిజెపి ఎప్పుడు కుడా ఒక కులంకు చెందిన పార్టీగా గుర్తింపు పొందలేదని గుర్తు చేసారు. అభివృద్ధికోసం `సబ్ సాత్ సబ్ కా వికాస్’ అని మంత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారని తెలిపారు.

రాజస్తాన్ లో రైతుల కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజే చేసిన కృషిని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ 50 వేల వరకు వ్యవసాయ రుణాలను రద్దు చేసినదని గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వం ఖరిఫ్ పంటలకు ఉత్పతి ఖర్చులకు మించి ఒకట్టిన్నర రెట్లు లభించే విధంగా మద్దతు ధర పెంచినదని పేర్కొన్నారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో రైతులకు ఉత్పత్తి వ్యయంకు మించి ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఎందుకు లభించలేదని నేను రాహుల్ జీని అడగాలను కొంతున్నానని తెలిపారు.

జాతీయ పౌరసత్వ రిజిస్టర్ విషయమై కాంగ్రెస్ పై ముప్పెడ దాడి జరుపుతూ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి రాజస్తాన్ వరకు ఉన్న అక్రమ వలసదారులు ప్రతి ఒక్కరిని  గుర్తిస్తుందని స్పష్టం చేసారు. “మేము దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని దేశం నుండి పంపి వేయాలని ప్రతిజ్ఞ తీసుకొంటే, కాంగ్రెస్ మాత్రం వారందరినీ దేశంలోనే ఉంచాలని కోరుకొంతున్నది” అంటూ ద్వజమెత్తారు.

కాంగ్రెస్ వోట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శిస్తూ బిజెపికి మాత్రం దేశ బద్రతయే ప్రధానమని అమిత్ షా స్పష్టం చేసారు. “పౌరసత్వ రిజిస్టర్ ను వోట్ బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. కానీ బిజెపి దేశ బద్రతను వోట్ బ్యాంకు రాజకీయాలకు అతీతంగా చూస్తున్నది. వలసదారులు దేశ యువకులకు రావలసిన ఉద్యోగాలని కైవసం చేసుకొంటున్నారు” అని పేర్కొన్నారు.