త్రిపురలో పోటీ లేకుండా బిజెపికి 96 శాతం సీట్లు

త్రిపురలో జరుగుతున్న పంచాయత్ ఉప ఎన్నికలలో 96 సీట్లను బిజెపి పోటీ లేకుండా గెల్చుకొంది. మొత్తం 18 జిల్లా పరిషద్ సీట్లను కైవసం చేసుకోంది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారుల మేరకు 3,075 గ్రామ పంచాయత్ లను, 154 పంచాయతి సమితిలను, 18 జిల్లా పరిషద్ సీట్లను పోటీ లేకుండా గెల్చుకొంది.

ఈ నెల 30న  3,207 గ్రామా పంచాయతీ, 161 పంచాయత్ సమితి, 18 జిల్లా పరిషద్ సీట్లకు ఎన్నిక జరుగవలసి ఉంది. గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా మొత్తం సీట్లను గెల్చుకోవడం ద్వారా దీర్ఘకాలం సిపిఎంకు కంచుకోటగా ఉన్న ఈ ఈశాన్య రాస్త్రంలో బిజెపి తన ఆధిక్యతను సుస్థిరం చేసుకొన్నట్లు అయింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వామపక్షాలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో తమ పదవులకు రాజీనామా చేసి, బిజెపిలో చేరడంతో ఈ ఎన్నికలు జరుపవలసి వచ్చింది. శుక్రవారంతో నామినేషన్ లకు గడువు ముగిసింది.

బిజెపి అనుసరిస్తున్న బెదిరింపుల కారణంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, స్వేచగా ఎన్నికలు జరుపగల వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చివరకు బిజెపి మిత్రపక్షం ఐ పి ఎఫ్ టి సహితం ఆరోపణలు చేసింది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల ఘర్షణలలో వారి మద్దతుదారులు, పోలీసులు కుడా గాయపడ్డారు.

అయితే రెండు పార్టీల నేతలు తమ మధ్య ఏర్పడిన విబేధాలను తోఅగించుకొని, ఉపఎన్నికలలో ఉమ్మడిగా పోరాడాలని అవగాహనకు వచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలను బిజెపి కొట్టిపారవేసింది.