బిజెపిలో చేరిన ఐవైఆర్‌ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకొచ్చిన బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో శనివారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో బిజ్పెఇ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఐవైఆర్‌ను తోడ్కొని వెళ్లగా అమిత్‌ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐవైఆర్‌ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగించుకుంటామని వెల్లడించారు. మున్ముందు కూడా పార్టీలో మరికొందరు చేరే అవకాశం ఉందని తెలిపారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు 1న నిర్వహించాలని ఐవైఆర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.