జగన్‌ కూడా చంద్రబాబు బాటలో 

గతంలో చంద్రబాబు నాయుడు కూడా మంద కృష్ణ మాదిగ జగన్‌ లను హౌస్‌ అరెస్ట్‌ చేస్తూ.. అక్రమంగా నిర్బంధించారని, ప్రస్తుతం జగన్‌ కూడా చంద్రబాబు బాటలో పయనిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత పైడికొండల మాణిక్యాలరావు ధ్వజమెత్తారు. 

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా.. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సేవా సప్తాహం నిర్వహించడం గురించి పాలకొల్లు లైన్స్‌ క్లబ్‌ లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి  సమావేశంలో పాల్గొంటూ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఏ నాయకుడికైనా ఉంటుందని అయితే అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని ఘాటుగా విమర్శించారు. 

టిడిపి నేతలను సోషల్‌ మీడియా ద్వారా బెదిరిస్తూ.. కొందరిపై పోలీసుల ద్వారా దాడులు చేస్తున్నారని ఇది సక్రమం కాదని జగన్‌ కు హితవు పలికారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పట్ల మాణిక్యాలరావు ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో వరదలు భారీ ఎత్తున వస్తుండగా.. ప్రజలను ముందు జాగ్రత్తగా శిబిరాలకు పంపడంలో జగన్‌ విఫలమయ్యారని ఆరోపించారు.