ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా మూలాలు పాక్ లోనే 

ప్రపంచంలో ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా వాటి మూలాలు మాత్రం పాకిస్తాన్‌లో ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై జరిగిన 3సెప్టెంబర్ 112 దాడులను ఆయన ప్రస్తావిస్తూ దాని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించారు. పొరుగు దేశం నుంచి ఉగ్ర దాడుల ప్రమాదం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అన్నివిధాల సంసిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 

ఇటీవల కాలంలో ఉగ్రవాదం అనేది ప్రతి సరిహద్దులోనూ ఒక విధానంగా మారింది. ఇది కేవలం ఏ ఒక్క దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులుకు  గురిచేస్తున్న ఉగ్రవాద మూలాలు మన పొరుగుదేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం ఇస్తున్న వర్గాల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రపం చ దేశాలు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

కఠినాతికఠినంగా వ్యవహరిస్తే తప్ప ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే సెప్టెంబర్ 11 తరహా దాడులు ఎక్కడైనా జరుగవచ్చని ఆయన హెచ్చరించారు.