కుమారస్వామిపై అసంతృప్తి

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కుడా పూర్తి కాకుండానే కర్నాటకలోని జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రజలలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నది. ఒక వంక ప్రభుత్వ సుస్థిరత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండగా, మరోవంక ప్రజామోదం లభించడం లేదని వెళ్ళాడి అవుతున్నది.

ఇండియా టుడే– మై యాక్సిస్‌ ఇండియా కర్ణాటకలో జరిపిన సర్వేలో అక్కడ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. ప్రభుత్వ పనితీరు బాగుందని 23 శాతం మంది, ఫరవాలేదని 28 శాతం మంది చెప్పగా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని 35 శాతం మంది కర్ణాటక ప్రజలు వెల్లడించారు. 11,480 మంది కన్నడిగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

తదుపరి ప్రధానిగా 55 శాతం మంది నరేంద్ర మోదీకి, 42 శాతం మంది రాహుల్‌ గాంధీకి మద్దతు తెలిపారు. తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయంలో ఇబ్బందులు తమ రాష్ట్రంలో ప్రధాన సమస్యలని సర్వేలో పాల్గొన్న ప్రజలు వెల్లడించారు. కుమారస్వామి సీఎం పదవి చేపట్టి నాలుగు నెలలైనా పూర్తికాకముందే ఆయనపై ఇంతటి వ్యతిరేకత రావడం గమనార్హం.