తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రం: గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపుతూ.. ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. గంగా జెమునా సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలను సమానంగా గౌరవిస్తోందని, 30 రోజుల కార్యచరణ ప్రణాళిక మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

హరితహరం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకలు అద్భుతంగా అమలవుతున్నయి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఉందని కొనియాడారు. ఆరోగ్య శ్రీ, కంటి వెలుగుతో ప్రజా వైద్యానికి పెద్ద పీట వేసిందని, ఐటి ఉత్పత్తులు లక్షా 10 వేల కోట్లు దాటిందని గవర్నర్ తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టు బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని, జై తెలంగాణ అంటూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రసంగాని ముగించారు.  

ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్‌ రికార్డ్‌ సృష్టిస్తోంది. సేవల రంగంలో అద్భుత పురోగతితో హైదరాబాద్‌. దేశంలోని మిగతారంగాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని తమిళిసై చెప్పుకొచ్చారు.