ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపిన ప్రధాని 

విక్రం ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డంతో ఇస్రో సెంట‌ర్‌లో ఉత్కంఠత నెలకొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డ ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని ఇస్రో చైర్మన్ శివన్‌ భుజం తట్టారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు.

మీ కృషి ఎంతో నేర్పిందని చెబుతూ  ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మాన‌వ‌జాతికి ఉత్త‌మ‌ సేవ‌చేశార‌ని కొనియాడారు. చాలా దిగులుగా క‌నిపించిన శాస్త్ర‌వేత్త‌ల్లో మోదీ జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. నేను మీవెంటే ఉంటాన‌ని ఆయ‌న వారికి హామీ ఇచ్చారు. ధైర్యంతో ముంద‌కు వెళ్దామ‌ని సూచించారు. మ‌ళ్లీ మ‌రికొన్ని ప్ర‌య‌త్నాల‌తో ముందుకు వెళ్దాం అని చెప్పారు. ఆల్ ద బెస్ట్ అని మోదీ తెలిపారు.

శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌నోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండింగ్ ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో అంతటా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. యావ‌త్ దేశం ఇస్రో వెంటే ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. మీ క‌ఠోర శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశాయ‌ని కాంగ్రెస్ త‌న ట్వీట్‌లో తెలిపింది. 

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా త‌న ట్వీట్‌లో రియాక్ట్ అయ్యారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అండ‌గా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌తి ఒక‌రిలోనూ మీరు అంత‌రిక్ష అవ‌గాహ‌న పెంచిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. భ‌విష్య‌త్తు ప్ర‌యోగాల కోసం బెస్ట్ విషెస్ చెప్పారాయ‌న‌.