అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం!

సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని టీఆర్​ఎస్​ సర్కారు మాత్రం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదు. 

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ​ భావిస్తోంది. ఒకవేళ కేంద్రం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించినట్టయితే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హైదరాబద్​లోని ఏదైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక లేదా మహారాష్ట్రలో జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం​ ఉంది. 

రెండు, మూడు రోజుల్లో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఇది కుదరనిపక్షంలో సెప్టెంబర్​ 17న నిజామాబాద్​లో బీజేపీ భారీ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి అమిత్​ షా ప్రసంగించనున్నారు.