అజిత్ జోగి కుమారుడు అమిత్ అరెస్ట్

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ జోగి ఎస్టీ కాదని 2013లో అతనిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సమీరా పైకారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. 

అయితే ఇటీవలే అమిత్ జోగి ఎస్టీ కాదని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్దారించింది. దీంతో ఫేక్ సర్ఠిఫికెట్ ఇచ్చారంటూ అమిత్ జోగిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ (మంగళవారం) ఉదయం భారీ బలగాలతో అతని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు జోగి అనుచరులు ప్రయత్రించగా.. కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. 

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం తన కుమారుడిని అరెస్ట్ చేసిందని అజిత్ జోగి ఆరోపించారు. త్వరలో దంతెవాడలో జరగనున్న ఉప ఎన్నికల్లో తనను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని అమిత్ జోగి మండిపడుతున్నారు.  

మూడేళ్ళ క్రితం తండ్రి ప్రారంభించిన జంటా కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా అమిత్ జోగి వ్యవహరిస్తున్నారు.