ఎన్నార్సీ తుది జాబితాపై సుప్రీంకు బీజేపీ

ఎన్నార్సీ తుదిజాబితాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సుప్రీంలో తేల్చుకోవాలని నిర్ణయించింది.  ఇటు అస్సాం బీజేపీ శాఖ, అటు కేంద్ర నాయకత్వం కూడా దాదాపు ఇదే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జాబితాను మరోసారి పునః పరిశీలించాలని సుప్రీంను కోరనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. 

అస్సాం బీజేపీ ముఖ్యనేత హిమవంత బిశ్వాస్ శర్మ మాట్లాడుతూ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని జిల్లాల్లో దాదాపు 20 శాతం డేటాను పునః పరిశీలించాలని తాము సుప్రీం తలుపు తట్టనున్నట్లు ప్రకటించారు. అటు కేంద్ర నాయకత్వం కూడా దాదాపు పది శాతం డేటాను పునః పరిశీలించాలని సుప్రీంను కోరనున్నారు. 

చివరి జాబితా రాగానే బీజేపీ నాయకత్వం తీవ్ర ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. జాబితాలో ఎక్కువగా అక్రమ బంగ్లాదేశీయులకే చోటు దక్కడం, హిందువులు అధిక సంఖ్యలో గల్లంతు కావడంతో జాబితాను పునః పరిశీలించాలంటూ సుప్రీం మెట్లెక్కనుంది.