చంద్రబాబుకు వారంట్ పై అనవసర రాద్దాంతం

ఆపరేషన్‌ గరుడలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి న్యాయస్థానం ద్వారా నోటీసులు అందించారని ఆరోపణలు చేస్తుండటం ఎంతో హాస్యాస్పదంగా ఉందని బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ఈ వారంట్ పై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు గరుడ అనేది ఎక్కడుందో తమకి తెలియదని కొందరు వ్యక్తులు తమ సొంత ప్రచారం కోసం చేసుకుంటున్నారని విమర్శించారు.

విశాఖలో దోమలు పెరిగి డెంగీతో ప్రజలు బాధ పడుతున్నారని, అది కూడా గరుడలో భాగంగా చెప్పుకోవడం ఎంతో హాస్యాస్ప‌దంగా ఉంటుందో ఈ మాటలు అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్ర‌బాబు, స‌హ‌చ‌రులు బాబ్రీ విషయంలో పోరాటాలు చేయడానికి మహారాష్ట్ర వెళ్లడం జరిగిందని, అనుమతులు లేకుండా ఆందోళన చేశారనే నెపంతో మహారాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఆ కేసులో భాగంగా న్యాయస్థానం ఇప్పుడు నోటీసులు పంపించిందని తెలిపారు.

న్యాయస్థానం విషయంలో ఎప్పుడు నోటీసులు వస్తాయో ఎవ్వరికి తెలియదని, అది కూడా కక్షసాధింపు చర్యలో భాగంగా వచ్చాయని అనడం సమంజసం కాదని హితవు చెప్పారు.  విజ్ఞత ఉన్న‌వారు ఎవరు ఇలా మాట్లాడరని అంటూ ఇలాంటి నోటీసులు ద్వారా సీఎం ప్రతిష్ఠ ఏమాత్రం తగ్గదని స్పష్టం చేసారు