వినాయకచవితి ఉత్సవాలకు అడ్డుతగిలితే సహించం!

పలు రకాల అనుమతుల పేరుతో ఏపీ ప్రభుత్వం వినాయకచవితి ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తున్నదని మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "జగన్ మోహన్ రెడ్డిగారు మీ మతం కోసం జెరుసలేం యాత్ర చేసుకోండి,మాకు అభ్యంతరం లేదు మా వ్యక్తి గతమైన ఆరాధన విష్యంలో భంగం కలిగించే విధంగా అడ్డంకులు సృష్టిస్తే మాత్రం మేము ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం" అని ముఖ్యమంత్రిని చ్చరించారు. 

పాకిస్తాన్ లో ఉన్న ఆంక్షలు ఇక్కడ కూడా అమలు చేస్తునారని దుయ్యబట్టారు. ఎక్కడైనా వినాయకుడు చవితి జరుపుకోవాలంటే ముందుగా పోలీస్ ఆనుమతులు, మున్సిపల్ అనుమతులు, పంచాయితీ అనుమతుల ఆనే నెపం వేస్తూ ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జరగకుండా అడ్డగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆనుమతులు పేరుతొ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

అప్పట్లో బ్రిటిష్ వారు కూడా వినాయకుడు చవితిని  జన్మ హక్కుగా భావించి వినాయక చవితి ఉత్సవాలను జరుపు కొనేవారనిమాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఒక మతానికి కొమ్ము కాస్తూ మరొక మత కార్యక్రమాలకు విఘాతం కలిగించాలని ఆలోచనలుతో ఉన్నారాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని బీజేపీ నేత తీవ్ర ఆరోపణ చేసారు. 

సీఎం వ్యక్తిగతంగా ఏ మతాన్నైనా అనుసరించవచ్చని, కానీ హిందువుల హక్కులకు అడ్డుతగిలితే మాత్రం సహించమని స్పష్టం చేశారు. దేన్నైనా ఎదుర్కోడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందని మాణిక్యాల రావు హెచ్చరించారు. 

వినాయక చవితి జరుపుకోవడానికి ఏ రకమైన అనుమతులు అవసరం లేదని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. భక్తులు గతంలో ఏరకంగా చేసుకున్నామో అదేరకంగా చేసుకుందామని స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను అడ్డగిస్తే ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి ప్రజలంతా ఐక్యమత్యంతో సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.