మోడీ పేరు చెప్పగానే… పాక్ మంత్రికి కరెంట్ షాక్

పాక్‌ రైల్వే శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షేక్ రషీద్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వేదికపై కుప్పకూలాడు. 

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను భారత్  రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు పాక్ మంత్రులు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్  కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలేమిటో తమకు తెలుసునంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. 

ఆయన మోడీపై కామెంట్లు చేస్తున్న సమయంలోనే విద్యుదాఘాతానికి గురయ్యారు  దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తనకు విద్యుత్‌ వల్లే షాక్‌ తగిలిందని, ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ రషీద్‌ వ్యాఖ్యానించడంపై భారత్ ప్రజలు భగ్గమంటున్నారు. 

కశ్మీర్ అంశంపై ఇటీవల రషీద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ కోసం భారత్ తో యుద్ధం చేస్తామని, భారత్, పాక్ మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే.