సేవా దివస్‌గా ప్రధాని పుట్టినరోజు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబరు 17న 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజును ‘సేవా దివస్‌’గా పేర్కొంటోంది భారతీయ జనతా పార్టీ. ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బిజెపి నేతలు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.

ఈసారి పుట్టినరోజు వేడుకలను ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో జరుపుకోనున్నారు. సెప్టెంబరు 17న వారణాశిలో పర్యటించనున్న ప్రధాని మోదీ అక్కడ పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేయనున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

రింగ్‌ రోడ్డు ప్రారంభోత్సవం, మహిళల కోసం ప్రత్యేకంగా రూ. 20 కోట్లతో నిర్మించనున్న రెండు ఆసుపత్రులకు శంకుస్థాపన, రూ. 600కోట్లతో నిర్మించే క్యాన్సర్‌ ఆసుపత్రికి శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత బనారస్‌ హిందూ యునివర్శిటీలో ఏర్పాటుచేసే కార్యక్రమంలో మోదీ ప్రసంగింస్తారు.