మోదీ, అమిత్‌షాలకుపై హత్యా బెదిరింపులు

ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు బహిరంగంగా హత్యా బెదిరింపులు చేసిన టీఎంఎంకే నేతను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు... పెరంబలూరు జిల్లా లెప్పైకుడికాడు బస్టాండు వద్ద టీఎంఎంకే తరఫున 23వ తేదీన సమావేశం జరిగింది. 

ఇందులో పాల్గొన్న టీఎంఎంకే నేత ఎం.ముహ్మద్‌ షరీఫ్‌ మాట్లాడిన వీడియో కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేశారు. మోదీ, అమిత్‌ షాలకు బహిరంగంగా హత్యా బెదిరింపులు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుచ్చికి చెందిన నిందితుణ్ని బుధవారం ఉదయం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.