మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్

మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగలింది. నాలుగుసార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నేత  డాన్వా దెత్‌వెల్సన్‌ లాపాంగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో యువరక్తంను ప్రోత్సహించే నెపంతో సేనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అంటూ తమ అవసరం లేనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.  అయిష్టంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

''నా అభిప్రాయం ప్రకారం, సీనియరులు, కుర వృద్ధుల సేవ పార్టీకి ఇకపై ఉపయోగపడదు,'' అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిమితులు తనను నిరుత్సాహ పరుస్తున్నాయని, తనకు సౌలభ్యంగా లేదని తెలిపారు.

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న లాపాంగ్‌ 1992లో మేఘాలయ ముఖ్యమత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2003, 2007, 2009 సంవత్సరాలలో కుడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యలో ఒక సారి మినహా 1972 నుండి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. సుదీర్ఘకాలం ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడిగా పనిచేసారు.