అచేతనావస్థలో ఇసియులో ఉన్న రోగి కాంగ్రెస్

అచేతనావస్థలో ఇసియులో ఉన్న రోగి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇసియులో ఉన్న రోగులను `సజీవంగా’ ఉండటం కోసం వైద్యులు ఏవిధంగా అయితే `సపోర్ట్ సిస్టం’లను అందిస్తూ ఉంటారో, అదే విధంగా ఇప్పుడు ఇతర పార్టీలను `సపోర్ట్ సిస్టం’లుగా వాడుకొని బ్రతికే ప్రయత్నం చేస్తున్నదని ఎద్దేవా చేసారు.

ఇదు లోక్ సభ నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్ స్థాయిలోని బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతూ “ఒక రోగి ఇసియులో ఉన్నప్పుడు పలు పరికరాలను వాడుతూ ఉంటారు. శరీరంలో ఒకొక్క భాగంలో ఒకొక్క పరికరాని వాడతారు. ఆ విధంగా అయినా అతనిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కుడా వివిధ పార్టీలను ఆ విధంగా వాడుకొంతున్నది. ఆ విధంగా ఇసియు నుండి బతికి బైట పడే ప్రయత్నం చేస్తున్నది” అని ప్రధాని పేర్కొన్నారు.

జైపూర్ రూరల్, ఘజియాబాద్, హజారిభాగ్, నవాడ, అరుణాచల్ (పశ్చిమ) నియోజకవర్గాలలోని బిజెపి కార్యకర్తలు ఈ గోష్టిలో పాల్గొన్నారు. అరుణాచల్ (పచ్చిమ) నుండి ఒక పార్టీ కార్యకర్త వేసిన ప్రశ్నకు జవాబిస్తూ కొంత కాలోం క్రితం మధ్యప్రదేశ్ లో జరిగిన పార్టీ సదస్సులో ఏ పార్టీతో కుడా పొత్తు పెట్టుకోరాదని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినదని గుర్తు చేసారు. ఇప్పుడు ఏ పార్టీకి ఏమైనా ఇవ్వడానికి కారణం ఏమిటి ? తమను బతికించమని ప్రాధేయపడే విధంగా ఎందుకు చేస్తున్నారు ? అని ప్రశ్నించారు.

2013-14లో కన్నా పెద్ద ముంచుకొని వస్తుందని గ్రహించడం వల్లననే ఇప్పుడు ప్రతిపక్షాలు చేతులు కలుపు తున్నయని ప్రధాని ఆరోపించారు. అటువంటి పెద్ద ఉప్పెన వస్తే వారేమి చేస్తారు ? ఒకరినోక్కరు చేతులు పట్టుకొని కాపాడు కొనే ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో అందరూ కొట్టుకు పోవచ్చు. అందుకనే ఎవ్వరి చేతులు ఎవ్వరు పట్టుకొంటారు, ఎవ్వరికీ ఎవ్వరు మద్దతు ఇస్తారు అంటూ అన్వేషణ చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు చెబుతున్న `మహాగటబంధన్’ అనెడిది పొత్తులు ఏర్పరచు కోవడం కాదని, తమ బలహీనతలు కాపాడు కోవడానికి దగ్గరకు వచ్స్తున్న అవకాశవాద పార్టీలు అని ప్రధాని ఎద్దేవా చేసారు. “వారు పార్టీలను అనుసంధానం చేస్తున్నారు. మనం 125 కోట్ల ప్రజల హృదయాలను అనుసంధానం చేస్తున్నాం. అదే తేడా” అంటూ చెప్పుకొచ్చారు.

`మహాగటబంధన్’ నాయకత్వంపై వారిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటూ వారి విధానాలు కుడా స్పష్టంగా లేవని చెప్పారు. “వారి ఏకైక లక్ష్యం మోడీ హటావో. మన ఏకైక లక్ష్యం దేశ అభివృద్ధి” అని ప్రధాని తెలిపారు. బిజెపికి, ప్రతిపక్షాలకు మధ్య ఉన్న తేడాలను మోడీ వివరిస్తూ “వారు వరసత్వంతో గుర్తింపు పొందారు. మనం మనం చేసే పనుల ద్వారా గుర్తింపు పొందుతున్నాం. వారి లక్ష్యం కుటుంభాల సంక్షేమం. మన లక్ష్యం దేశం ప్రజల సంక్షేమం” చెప్పారు.

ఒక సాధారణ కార్యకర్త అయిన తాను బిజెపిలో ప్రధానమంత్రి పదవికి చేరుకో గలిగానని అంటూ “ఇతర పార్టీలలో పరిస్థితులను మీరు చూడండి. కాంగ్రెస్ లోని పలువురు ప్రముఖ నాయకులను చూస్తే కొన్ని సార్లు నాకు సానుభూతి కలుగుతుంది. వారి పోరాటాలు, సామర్ధ్యం కేవలం ఒక కుటుంభానికి మాత్రమె సహకరిస్తున్నాయి. పరివారం ఉన్నతి  కోసం సామర్ధ్యం గల చాల మంది త్యాగాలు చేస్తున్నారు” విచారం వ్యక్తం చేసారు.

తన ప్రభుత్వ లక్ష్యం “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” అని స్పష్టం చేస్తూ సుభాగ్య పధకం క్రింద “రామేశ్వర్” ఇంటికి విద్యుత్ సదుపాయం కలిగిస్తే, “రెహ్మాన్, రాతిందర్, రాబర్ట్ ఇళ్ళకు కుడా అటువంటి సబుపాయం కలిగించిన్నట్లు మోడీ గుర్తు చేసారు. విఐపి సంస్కృతికి తమ ప్రభుత్వం అంతం పలికినదని చెబుతూ “ఇపిఐ” (ప్రతి వ్యక్తి ముఖ్యం) అనే భావనతో పనిచేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.

ఒకొక్క పార్టీ కార్యకర్త కనీసం 20 మంది కొత్తవారిని, సమాజంలోని ప్రతి వర్గం నుండి చేర్పించడం ద్వారా వచ్చే ఎన్నికలలో బిజెపి విజయం కోసం పనిచేయాలని ఉద్బోధించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి కార్యకర్త పార్టీ శిఖరాగ్రాన ఉండి నేతృత్వం వహించే అవకాశం ఒక్క బిజెపిలోనే దక్కుతుందని చెప్పారు. గత నాలుగేళ్ల బిజెపి పాలనలో దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని చెబుతూ ఇదే విషయాన్ని యావత్‌ ప్రపంచం, ప్రముఖ సంస్థలు సైతం ఢంకా భజాయించి మరీ చెబుతున్నాయని గుర్తు చేసారు.

నాలుగేళ్ల క్రితం ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉండేదని,  ప్రస్తుతం ఆరో స్థానంలో నిలిచామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు.