4 రాజధానులు ... అదే జగన్ ఆలోచన!

 రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్‌ చెప్పారని బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ సంచలన ఆరోపణ చేశారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్‌ ఉన్నట్లు టీజీ వెల్లడించాయిరు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ముందుకు వెళ్తున్నారని చెబుతూ జగన్ చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నట్లు చెప్పా

అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. అమరావతిని ఫ్రీజోన్‌ చేయాలని గతంలో అడిగామని టీజీ గుర్తు చేశారు. అమరావతి మీదే దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో టిడిపిసహా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ఓడిపోయారని టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదమని చెప్పారు. 

మరోవైపు తెలంగాణ సీఎంపైనా టీజీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌తో ఎవరు కలిసినా నాశనం తప్పదని జగన్ ను పరోక్షంగా హెచ్చరించారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవడం ఖాయం అని స్పష్టం చేశారు. 

పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదని హితవు చెప్పా రు. పోలవరం ప్రాజెక్టు పనులను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే.. చంద్రబాబు దాన్ని కొనిసాగించారని టీజీ చెప్పారు.