శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

ధ్వజారోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌.. అఖిలాండం వద్ద పూజలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం తలకు పరివస్త్రం చుట్టి పట్టు వస్త్రాలను తలపై ఉంచి.. ఆలయ మర్యాదలతో మహాద్వారం వద్దకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, బోర్డు సభ్యులు చల్లా బాబురెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జిల్ల కలెక్టర్‌ ప్రద్యుమ్న, అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతి, ఎస్వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

కాగా, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి వాహన సేవలో భాగంగా మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల విహరించారు.

అల వైకుంఠములో శ్రీమన్నరాయణుడు, సర్పశ్రేష్టుడు, సర్పజాతిలో అగ్రగణ్యుడైన ఆదిశేషువు మీద శయనిస్తుంటారు. ఏడు పడగలు కలిగిన ఆదిశేషుడు స్వామికి శయ్యగా ఉంటాడు. అందుకే అన్నమయ్య తిరుమల కొండలను పదివేల శేషుల పడగల మయముగా వర్ణించాడు. శ్రీ వైకుంఠనాధునికి ఆదిశేషువు తల్పం, తలగడ, ఎండవానల నుంచి రక్షించే ఛత్రం.

నిరంతరం శ్రీనివాసుని సేవలో తరించే ఆదిశేషువునే బ్రహ్మోత్సవాల్లో తొలివాహనంగా చేసుకోవడం భగవంతుని కరుణ