మైనారిట్లో భరోసా కల్పించిన మోదీ ప్రభుత్వం

నరేంద్ర మోదీ ప్రభుత్వం మైనారిట్లో భరోసా కల్పించందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలోనే తమకు రక్షణ ఉందన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీల్లో వ్యక్తమవుతోందని చెప్పారు. అంతకు ముందు పార్టీలు తమ ఓట్లు వేయించుకోవడమే తప్ప బాగోగులు పట్టించుకోలేదన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీల్లో వ్యక్తమవుతోందని నఖ్వీ చెప్పారు. మైనారిటీలను రాజకీయ పార్టీలు దోచుకున్నాయని ఆయన విమర్శించారు.   

ఇప్పటి వరకు ముస్లింలలో దశాబ్దాలుగా బీజేపీ అంటే ఓ ద్వేషభావం కల్పిస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. కొన్ని శక్తులు పనిగట్టుకుని ముస్లిం మైనారిటీల మనసుల్లో విషబీజాలు నాటాయని నఖ్వీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోదీ సమర్ధవంతమైన పాలన చూశాక మైనారిటీల్లో ఎంతో మార్చు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విష ప్రచారం నుంచి బయట పడుతున్నారని కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి స్పష్టం చేశారు. 

 జనాభాను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుటుంబ నియంత్రణ వంటిది కాదని, అదొక ‘ఎమర్జెన్సీ స్టయిల్’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇలాంటి సున్నితమైన అంశంపై సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు. అలాగే దానిని ఒక మతపరమైందిగా చూడడం సరైంది కాదని నఖ్వీ విజ్ఞప్తి చేశారు.

‘అధిగ జనాభాపై ప్రజల్లో అవగాహన తీసుకురాలి. స్వచ్ఛ కార్యక్రమంలా మంచి ప్రచారం చేయాలి’అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో పెహ్లుఖాన్‌పై జరిగిన మూకదాడి, హత్య కేసులో నిందింతులందర్నీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా ‘శాంతి భత్రదలు పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. నేరస్తులను శిక్షించే అధికారం వారికే ఉంటుంది’అని చెప్పుకొచ్చారు. 

ప్రతిదాన్నీ మతం కోణంలోనే చూడడం సరైంది కాదన్న మంత్రి నేరం ఏదైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు తరువాత ముస్లిం మైనారీటల్లో మోదీ ప్రతిష్ట పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీఎస్‌టీ సహా పలు సంస్కరణలు మోదీ ప్రభుత్వం ప్రతిష్టను పెంచాయని నఖ్వీ చెప్పారు. ఎలాంటి వివక్షలేకపోవడం, దాడులు జరగకపోవడంతో మైనారిటీల్లో మోదీ ప్రభుత్వం నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.