అమరావతికి అప్పుడు జగన్‌ అంగీకారం

వైసిపి ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పుడు జగన్‌ అంగీకరించారని గుర్తు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన అమరావతి రాజధాని ప్రాంత రైతులతో ఆయన మాట్లాడుతూ రాజధానిపై వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. 

రాజధాని వస్తుందని మూడు పంటలు పండే పొలాలను ఇక్కడి రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసిపి ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే వేల కోట్లు రాజధాని కోసం వెచ్చించారని.. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారుబిజెపి. 

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని కన్నా చెప్పారు. రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఇపుడు కౌలు కూడా ఇవ్వటం లేదని కన్నా ఆరోపించారు. సీఆర్డీయే అధికారులను కలిసినా తమకు స్పష్టత ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి నుంచి మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

రాజధానికి వరద వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. దేశంలో చాలా రాజధానులు నదులు, సముద్రాల పక్కన ఉన్నాయన్నారు. నదీతీరంలో రాజధాని ఉండటం సానుకూల అంశమని చెబుతూ రాజధాని రైతులకు బిజెపి అండగా ఉంటుందని కన్నా భరోసా ఇచ్చారు. ‘అమరావతిలోనే రాజధాని ఉండాలన్నదే తమ భావన’ అని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చేస్తారంటూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతరైతులు  కన్నా లక్ష్మీనారాయణను ఇవాళ ఉదయం కలిశారు. గత ప్రభుత్వం అడిగితేనే తమ భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు. రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని, భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని ఆయన దగ్గర వాపోయారు. సీఆర్‌డీఏ అధికారులను కలిసినప్పటికీ వాళ్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కన్నా దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.