రికార్డు సృష్సించిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో

ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ప్రముఖ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 12న ప్రసారమైన ఈ షోలో భాగంగా ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోడీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు.

ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారమైన ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రికార్డుస్థాయిలో వీక్షించారు. ఈ స్పెషల్ షోతో డిస్కవరీ చానెల్ ఏకంగా 36 లక్షల 90వేల ఇంప్రెషన్స్ సాధించి, దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. సీరియల్స్‌తో ముందంజలో ఉండే స్టార్ ప్లస్ (36 లక్షల 70 వేల ఇంప్రెషన్స్)ను వెనక్కునెట్టి ఈ ఘనతను సొంతం చేసుకొంది. 

ఇన్ఫోటైన్‌మెంట్ జానర్‌లో ఇంతగా వ్యూస్ దక్కడం ఇదే తొలిసారి. ఈ షోను ఆసాంతం ప్రేక్షకులు వీక్షించారని, సగటున 29.2 నిమిషాలపాటు ప్రేక్షకులు ఈ షోను తిలకించారని వెల్లడైంది.