హైదరాబాద్‌ను యుటిగా చేయడం లేదు

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడిం చారు. 

హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసే అంశంలోనూ, కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తున్నామని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇవి చాలా రోజులుగా సాగుతున్న ప్రచారంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించ బోతున్నారన్న విషయంపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. రాజధాని మార్పు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి స్పందించిన విషయమని ఆయన తెలిపారు. ఇది అసలు కేంద్ర పరిధిలోకే రాదని, అలాంటప్పుడు మేము ఎలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నించారు. 

పేదప్రజల ఆరో గ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకొచ్చిన ఆయు ష్మాన్ భవ కార్యక్ర మాన్ని బక్వాస్ అని టిఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యా నించడం తగదని హితవు చెప్పారు. ఇక్కడి రోగుల దృష్టా దానిని తెలంగాణలో కూడా అమలు చేయాలని సూచించారు. 

కాగా, త్వరలో రాష్ట్రంలో జరగ నున్న మున్సిపల్ ఎన్నికలు బిజెపి టార్గెట్ కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో విజయం సాధించమే తమ అంతిమ లక్షమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఎవరో తెలియదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. రాజకీయాల్లో పరస్పరం గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు.