15న అమిత్‌ షా తెలంగాణలో పర్యటన

తెలంగాణ అసెంబ్లీకు ముందస్తు ఎన్నికలు రానున్న దృష్ట్యా పార్టీ ఎన్నికల శంఖారావం పూరించడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సెప్టెంబర్‌ 15న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు లో జరిగే బహిరంగ సభలో పాల్గోండంతో పటు హైదరాబాద్ లో పార్టీ నాయకులతో ఎన్నికల వ్యూహ రచనపై విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు. తగు మార్గదర్శనం చేస్తారు.

అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక పక్రియను ప్రారంభించినప్పటికీ బిజెపి నేతలు అమిత్ షా రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసేసరికి కనీసం పది బహిరంగ సభలలో రాస్త్రంలో ఆయన ప్రసంగిస్తారని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా శక్తి కేంద్ర ప్రముఖులతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా ఇంఛార్జ్‌లు, అధ్యక్షులతో ఆయన భేటీ కానున్నారు.

15వ తేదీ మధ్యాహ్నం మహాబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈనెల 29న కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు డా. కే లక్ష్మణ్ తెలిపారు. అమిత్ షా బహిరంగసభ కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.