ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో బ్రేక్ !

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వర్షాకాల సమావేశాలలో కుడా రాజ్యసభలో ఆమోదం లభించలేదు. గత ఏడాదే లోక్ సభ ఆమోదించినా రాజ్యసభ ఆమోదించక పోవడంతో చట్టంగా మారలేదు. ఈ బిల్లును చర్చించడం లేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన తెలిపారు. దీంతో ఈ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో మళ్లీ సభ ముందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముస్లిం సాంప్రదాయం ప్రకారం. మూడు సార్లు తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్లే. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా తలాక్ చెప్పే సంస్కృతికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నది. దానితో ఇప్పుడు  ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశం కనిపిస్తున్నది.

ఈ చట్టంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో హడావుడిగా ట్రిపుల్ తలాక్ చట్టంలో మార్పులు చివరినిమిషంలో క్యాబినెట్ కొన్ని మార్పులు తీసుకు వచ్చింది. రెండు వివాదాస్పద ప్రతిపాదనలను మార్చాలని నిర్ణయించింది.