టెండర్ల రద్దుతో పోలవరం నిర్మాణంలో జాప్యం

టెండర్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ స్పష్టం చేశారు. జెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం అంతరం రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని హెచ్చరించారు. 

పైగా  పోలవరం గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని జైన్‌ తెలిపారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. 

సుమారు ఐదు గంటలపాటు జరిగిన సమావేహంలో పోలవరం టెండర్ల రద్దుపై చర్చించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తీరు.. తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు.

పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి  కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.