శశిథరూర్‌కు అరెస్టు వారెంట్‌

బిజెపిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు కోల్‌కతాలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గతేడాది జులైలో కేరళ రాజధాని తిరువనంతపురంలో  జరిగిన ఒక రాజకీయ సభలో థరూర్‌ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బిజెపి తిరిగి అధికారం చేపడితే భారత్‌ను ‘హిందూ పాకిస్థాన్‌’గా మారుస్తుందంటూ తీవ్రవాఖ్యలు చేశారు.

బిజెపి ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చి తమకు అనుకూలంగా సవరణలు కూడా చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో మాదిరిగా మైనార్టీ వర్గాలకు ఏ మాత్రం విలువనివ్వరని, పూర్తిగా అణిచివేస్తారంటూ విమర్శలు చేశారు.  గాంధీ, నెహ్రు, సర్దార్‌ పటేల్‌, మౌలానా అజాద్‌లాంటి గొప్ప నాయకులు,  స్వాతంత్ర్య యోధులు కలలుగన్న లౌకికవాద భారతదేశాన్ని నాశనం చేస్తారంటూ తీవ్రంగా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమిత్ చౌదరీ అనే న్యాయవాది థరూర్‌పై కోల్‌కతా కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఆరెస్టు వారెంటు జారీ చేసింది.