ఒక ఉజ్వల అధ్యాయం ముగిసింది

భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ పేర్కొన్నారు. కోట్లాది మందికి ఆమె మార్గదర్శకురాలు. ప్రజాసేవ, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ఘనంగా నివాళులు అర్పించారు. గొప్ప పరిపాలన దక్షురాలిగా ఆమె పని చేసిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. 

"అద్భుత కార్యదక్షత కలిగిన నేత. కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిప్రదాత. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే ఆమె వెంటనే స్పందించి సాయం అందించేవారు. ఆమె అద్భుత పార్లమెంటేరియన్‌, గొప్ప వక్త. బిజెపి పా ప్రయోజనాలు, సిద్ధాంతాల విషయంలో రాజీలేని నేత"  అని తెలిపారు. 

సుష్మా స్వరాజ్‌ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశం గొప్ప ప్రజాదరణ ఉన్న నేతను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. "సుష్మా స్వరాజ్‌ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది. సాయం చేయడంలో, ప్రజాసేవలో ఆమె కృషిని యావత్‌ దేశమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది" అంటూ రాష్ట్రపతి నివాళులు అర్పించారు. 

పాలనా దక్షత ఉన్న నేత, గొప్ప పార్లమెంటేరియన్‌, మంచి వక్త అయిన సుష్మా స్వరాజ్‌ మృతి తీరనిలోటు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. "సుష్మా స్వరాజ్‌ మృతి దేశానికి తీరని లోటు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, గొప్ప వక్త, పరిపాలనా దక్షురాలు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. 

సుష్మా స్వరాజ్‌ మృతి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆమె గొప్ప వక్త, అసాధారణమైన రాజకీయవేత్త