జగన్ ను వెంటాడుతున్న రూ 78 వేల కోట్ల లోటు

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంకు ఆర్ధిక సమస్యలు చికాకు కలిగిస్తున్నాయి. ఆదాయంపై మించి భారీగా ఖర్చులు ఉండడంతో వచ్చే మార్చి నాటికి ఏకంగా రూ.78 వేల కోట్ల  లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేసరికే ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాజా విశ్లేషణతో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది.

 రూ.2.27 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఆదాయ వ్యయాలను రూపండించింది. అయితే అప్పుడు అనుకున్న ఆదాయం తగ్గడం ప్రారంభిరచడంతో ఆందోళన పెరుగుతోంది. తొలి త్రైమాసికంలో కేవలం రూ.32,520 కోట్లు రాగా, రెండో త్రైమాసికంలో మొదటి నెల జూలైలో పది వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా అదే స్థాయి ఆదాయంతో మూడు నెలలకు రూ.31,973 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇదే సమయంలో మూడో త్రైమాసికంలో రూ.37,409 కోట్లు, చివరి త్రైమాసికంలో రూ.47,646 కోట్లు వస్తాయన్న అంచనాకు ఆర్ధికశాఖ వచ్చిరది. దీంతో మొత్తం ఏడాదికి రూ.1.49 లక్షల కోట్లు ఆదాయం రావచ్చాని భావిస్తున్నారు. ఇందులో  కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, కేంద్ర రోడ్డు నిధులు, ఆదాయ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కలిపి రూ.52,500 కోట్ల వరకు అంచనాల్లో పొందుపరిచారు. వాస్తవానికి కేంద్రం నుంచి రూ.96 వేల కోట్ల వరకు వస్తాయని బడ్జెట్‌లో పొందుపరచగా, అది రూ.40వేల కోట్లకు పైగా తగ్గుతాయన్న అంచనాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదిరచగా, అది చివరకు రూ.64500 కోట్లకు పరిమితం అవుతుందని ఇప్పుడు భావిస్తున్నారు. సేల్స్‌ టాక్స్‌ రూ.66వేల కోట్లు వస్తుందని అనుకోగా వార్షికాంతానికి అది రూ.45 వేలకు పరిమితమవ్వచ్చని భావిస్తున్నారు. రవాణా, ఎక్సయిజ్‌ పన్నుల్లోనూ లోటు ఉంటుందనే అంచనాలున్నాయి. పన్నేతర ఆదాయం ఆరు వేల కోట్ల వరకు వస్తుందని  బడ్జెట్‌లో ప్రతిపాదిరచగా, చివరికు ఆ ఆదాయం రూ.3500 కోట్లకు పరిమితమయ్యేటట్లు కనిపిస్తున్నది. రుణాలు కూడా రూ.47 వేల కోట్ల  వరకు బడ్జెట్‌లో ప్రతిపాదించగా, అవి కేవలం రూ.32 వేల కోట్ల వరకే పరిమితమవుతాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. 

మొత్తం సంవత్సరానికి రూ.2.27 లక్షల కోట్ల వరకు ఖర్చులు ఉంటాటాయని బడ్జెట్‌లో ప్రతిపాడించగా, ఆదాయం రూ.1.49 లక్షల కోట్ల మాత్రమే ఉండడంతో దాదాపు రూ.78,400 కోట్ల లోటు పడుతుందని భావిస్తున్నారు. జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, రుణం, వడ్డీలకు రూ.1.04 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, రూ.250 కోట్ల వరకు ఎక్కువ నిధులు కావాల్సి వస్తున్నది.

ఇక జగన్‌ ప్రకటిరచిన కొత్త పథకాలకు, కొనసాగుతున్న పాత పథకాలకు రూ.21వేల కోట్ల వరకు అవసరమని ముందుగా భావించగా, ఇప్పుడు రూ.25 వేల కోట్లు కావాల్సి వస్తున్నది. ఇవి కాక వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు మరో రూ.97 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని గుర్తించారు.