కాపు రేజర్వేషన్లపై జగన్ ధోరణిని తప్పుబట్టిన కన్నా

కాపు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరినిబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. టిడిపి ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదని హితవు చెప్పారు. ఈ అంశంపై సీఎం జగన్‌కి లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లలో ఈ వెసులుబాటు ఉందని కన్నా తెలిపారు. సామాజిక స్థాయి ఆధారంగా కమిషన్ వేసి వర్గీకరణ చేసుకోవచ్చనే మినహాయింపు కేంద్ర చట్టంలో ఉందని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు చరిత్రాత్మకమని కొనియాడారు. ముస్లిం మహిళల రక్షణ, ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.