కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చిన అమేథీ రాజవంశీకుడు

అమేథీ రాజవంశీకుడు సంజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను బుధవారం బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికూడా రాజీనామా చేశారు.  ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆమోదించారు. 

సంజయ్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. బుధవారం బీజేపీలో చేరుతానని ప్రకటించారు. 

కాంగ్రెస్ ఇంకా గతంలోనే ఉన్నదని, భవిష్యత్ గురించి పట్టించుకోవడం లేదని అంటూ నేడు దేశం ప్రధాని మోదీ వెంట ఉన్నదని,  అందుకనే తాను కూడా మోదీ వెంట ఉన్నదలిచానని తెలిపారు. 

సంజయ్ సింగ్ 1990వ దశకంలో బీజేపీ అభ్యర్థిగా అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అమేథీ ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టు ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ నేత మేనకా గాంధీపై పోటీ చేసి, పరాజయం పాలయ్యారు.