మోడీ మళ్ళి ప్రధాని కావాలంటే మూడు రాష్త్రాలు కీలకం

2019లో నరేంద్ర మోడీ తిరిగి ప్రధానిగా గెలుపొండాలంటే ఈ సంవత్సరం చివరిలో మూడు ఉత్తరాది రాష్త్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో బిజెపి తిరిగి గెలుపొందటం అత్యవసరమని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. జైపూర్ లోని సూరజ్ మైదాన్ లో వాన చినుకులు మధ్య జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సదస్సులో మాట్లాడుతూ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ లలో జరిగే ఎన్నికల ఫలితాలు వచ్చే సంవత్సరం మొదట్లో దేశ ప్రధాని ఎవ్వరు కావాలో నిర్ణయించగలవని చెప్పారు.

ప్రతి కార్యకర్త ఇదు గ్రామాలకు చొప్పున ఇంటింటికి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటో చూపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించి, వారి మద్దతు కూడాదీసుకొనే ప్రయత్నం చేయాలనీ దిశానిర్దేశం చేసారు. సరిహద్దులో సుర్జికల్ దాడుల నుండి మోడీ ప్రభుత్వం చేసిన ప్రతి పని గురించి వివరించి చెప్పమని సూచించారు.

కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రతిపక్షాలు అనుసరిస్తున్న విచ్చిన్నకర విధానాలను తూర్పుర బడుతూ `అవార్డు వాపసి’ నుండి ప్రజలను విభజించే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మనం మరింత ఆదిక్యతలతో గెలుస్తూ వస్తున్నామని గుర్తు చేసారు. ఈ సారి కుడా తప్పనిసరిగ్గా గెలుస్తామని భరోసా వ్యక్తం చేసారు.

బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి దేశం నుంచి వెనక్కి తిప్పి పంపేస్తామని స్పష్టం చేసారు. బంగ్లా చొరబాటుదారులెవ్వరినీ ఇండియాలో నివసించేందుకు తమ పార్టీ అనుమతించేది తెలిపారు.అసోం ఎన్ఆర్‌సీని వ్యతిరేకించే వారు మానవ హక్కుల పరిరక్షణ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఇలాంటి వాళ్లకు దేశం, దేశ ప్రజల గురించి ఏమాత్రం బాధ్యత లేదని ద్వజమెత్తారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'పశ్చిమ బెంగాల్ నేత ఇండియాలో అక్రమంగా ఉన్న వాళ్ల గురించి తెగ బాధపడిపోతున్నారు. ఇండియన్ల గురించి ఆమెకు లేశమైనా బాధ లేదు' అంటూ విమర్శించారు. 'పౌరసత్వ సవరణ బిల్లు'ను వలసదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ దీన్ని తీసుకువచ్చారని చెప్పారు.  హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వస్తే వారు అక్రమ వలసదారులు కాదని, శరణార్థులని, వారికి భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.