బియ‌ర్ గ్రిల్స్‌తో డిస్కవరీ ఛానల్ లో మోదీ అడ్వంచ‌ర్‌

డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో వ‌చ్చే ఫేమ‌స్ అడ్వంచ‌ర్‌ ప్రోగ్రామ్ మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్‌లో ప్ర‌ధాని మోదీ క‌నిపించ‌నున్నారు. ఆ షో హోస్ట్ ఎడ్వ‌ర్డ్ మైఖేల్ గ్రిల్స్ అలియాస్ బియ‌ర్ గ్రిల్స్‌.. ప్ర‌ధాని మోదీని ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆగ‌స్టు 12వ తేదీన డిస్క‌వ‌రీ ఛాన‌ల్ లో ప్ర‌సారం చేయ‌నున్నారు.

ఆ షోకు సంబంధించిన ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. బియ‌ర్ గ్రిల్స్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆ ట్రైల‌ర్ వీడియోను పోస్ట్ చేశాడు. అడ‌వుల్లో గ్రిల్స్‌తో క‌లిసి మోదీ టూర్ చేశాడు. జంతువుల‌ సంర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల అంశంపై మోదీతో గ్రిల్స్ చ‌ర్చించ‌నున్నాడు. ఆగ‌స్టు 12వ తేదీన రాత్రి 9 గంట‌ల‌కు ఆ కార్య‌క్ర‌మం ప్రసారం కానున్న‌ది.

`ఈ దేశానికి అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి మీరు, మిమ్ముల్ని స‌జీవంగా ఉంచ‌డ‌మే నా క‌ర్త‌వ్యం' అంటూ గ్రిల్స్ ఆ వీడియోలో కామెంట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో బియ‌ర్ గ్రిల్స్ ఇండియాకు వ‌చ్చాడు. అప్పుడు ఉత్త‌రాఖండ్‌లో ఉన్న జిమ్ కార్బెట్ టైగ‌ర్ ఫారెస్ట్‌లో షో చేశాడు. ఈ కార్యక్రమం ద్వారా భారత దేశంలో గల జీవ వైరుధ్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి, అరుదైన అడవి జంతువులను కాపాడుకోవలసిన అవసరంపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి వీలు ఏర్పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

మన దేశంలోని 12 డిస్కవరీ చానెల్స్ లలో కూడా ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, తమిళ్, తెలుగు బాషలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.ఈ ప్రత్యక కారక్రమం ప్రపంచ వ్యాప్తంగా డిస్కవరీ నెట్ వర్క్ చానెల్స్ లలో 180 దేశాలలో ప్రసారం అవుతుంది.

"నేను చిరకాలంగా ప్రకృతితో - పర్వతాలు, అడవులలో నివసిస్తున్నాను. ఆ అనుభవం నా జీవితంపై విశేష ప్రభావం చూపుతుంది. రాజకీయాలకు సంబంధం లేని ఒక ప్రత్యేక కార్యక్రమం, అది కూడా పకృతితో పరవశం చెందే పరిసరాలలో చేస్తామంటే సంతోషంగా అంగీకరించాను"  అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అపారమైన విశిష్టత గల భారత దేశ పర్యావరణ వారసత్వాన్ని ప్రపంచానికి చూపించడానికి, పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరాన్ని తెలియచెప్పడానికి, ప్రకృతితో కలసి సామరస్యంగా జీవించవలసిన అవసరాన్ని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం తనను విశేషమైన అవకాశం కల్పించినట్లు ప్రధాని తెలిపారు. మరోసారి అడవిలో గడపటం తనకు అనిర్వచనీయమైన అనుభవాన్ని కలిగించినట్లు సంతోషం వ్యక్తం చేశారు.